సహాయము

తెలుగు మధ్యలో ఇంగ్లీష్ పదాలు కావాలంటే?

ఆ ఇంగ్లీష్ పదాలని రెండు ##ల లేదా ` (బ్యాక్‌టిక్) మధ్యలో టైపు చెయ్యండి.

telugu (##Telugu##) leadaa aanglam (`English`)
తెలుగు (Telugu) లేదా ఆంగ్లం (English)

న మరియు మ లకి వత్తులు ఇవ్వాల్సినప్పుడు, సున్నా వస్తుంది. దీన్ని అధిగమించడం ఎలా?

సున్నా వచ్చే చాలా పదాల్ని n మరియు m లతో టైపు చెయ్యడం సులువు (ప్రతిసారీ M వాడడంకంటే). దీనివల్ల కొన్ని పదాల్లో లేదా బదులు సున్నా వచ్చేస్తుంటుంది. ఉ.దా.: ఆమ్లం, కాన్పు, పాన్పు, నాన్చు, మొదలగునవి. ఇలాంటి సందర్బాలలో, n లేదా m తర్వాత & చేరిస్తే సరి. రెండు హల్లులని & జతపరుస్తుంది.

aamlam, kaanpu, paanpu, naancu
ఆంలం, కాంపు, పాంపు, నాంచు

aam&lam, kaan&pu, paan&pu, naan&cu
ఆమ్లం, కాన్పు, పాన్పు, నాన్చు

అరసున్న మరియు విసర్గలని ఎలా టైపుచెయ్యాలి?

అరసున్నకి @M, మరియు విసర్గకి @h ని వాడండి.

telu@Mgu. gatam gata@h
తెలుఁగు. గతం గతః

ఌ, ౡ లు టైపుచెయ్యడం ఎలా?

వీటిని ఇప్పుడు ఎవరూ వాడడం లేదు. ఇవి దాదాపుగా అంతరించిపోయాయి. ఌ కి ~l ని, ౡ కి ~L ని వాడండి.

ivi ~l~L lu
ఇవి ఌౡ లు

ౘ మరియు ౙ లను టైపు చెయ్యడం ఎలా?

~ca, ~ja
ౘ, ౙ

నా సమస్యకి ఇక్కడ పరిష్కారం సూచించబడలేదు. నేనేంచేయాలి?

మీరు తెలుగుబ్లాగు గూగుల్ సమూహానికి మీ సమస్యని పంపించవచ్చు. నేను లేదా ఆ సమూహంలోని సభ్యులేవరైనా మీకు పరిష్కారాన్ని సూచించగలము. లేదా ట్విట్టరులో నన్ను సంప్రదించండి.

🡠 తిరిగి మొదటి పేజీకి