సహాయము
- తెలుగు మధ్యలో ఇంగ్లీష్ పదాలు కావాలంటే?
- అవసరంలేని చోట వచ్చే సున్నాని అధిగమించడం ఎలా?
- అరసున్న మరియు విసర్గలని ఎలా టైపుచెయ్యాలి?
- ఌ, ౡ లు టైపుచెయ్యడం ఎలా?
- ౘ మరియు ౙ లను టైపు చెయ్యడం ఎలా?
- నా సమస్యకి ఇక్కడ పరిష్కారం సూచించబడలేదు. నేనేంచేయాలి?
తెలుగు మధ్యలో ఇంగ్లీష్ పదాలు కావాలంటే?
ఆ ఇంగ్లీష్ పదాలని రెండు #ల మధ్యలో టైపు చెయ్యండి.
telugu (#Telugu#)→ తెలుగు (Telugu)
న మరియు మ లకి వత్తులు ఇవ్వాల్సినప్పుడు, సున్నా వస్తుంది. దీన్ని అధిగమించడం ఎలా?
సున్నా వచ్చే చాలా పదాల్ని n మరియు m లతో టైపు చెయ్యడం సులువు (ప్రతిసారీ M వాడడంకంటే). దీనివల్ల కొన్ని పదాల్లో న లేదా మ బదులు సున్నా వచ్చేస్తుంటుంది. ఉ.దా.: ఆమ్లం, కాన్పు, పాన్పు, నాన్చు, మొదలగునవి. ఇలాంటి సందర్బాలలో, n లేదా m తర్వాత & చేరిస్తే సరి. రెండు హల్లులని & జతపరుస్తుంది.
aamlam, kaanpu, paanpu, naancu→ ఆంలం, కాంపు, పాంపు, నాంచు
aam&lam, kaan&pu, paan&pu, naan&cu→ ఆమ్లం, కాన్పు, పాన్పు, నాన్చు
అరసున్న మరియు విసర్గలని ఎలా టైపుచెయ్యాలి?
అరసున్నకి @M, మరియు విసర్గకి @h ని వాడండి.
telu@Mgu. gatam gata@h→ తెలుఁగు. గతం గతః
ఌ, ౡ లు టైపుచెయ్యడం ఎలా?
వీటిని ఇప్పుడు ఎవరూ వాడడం లేదు. ఇవి దాదాపుగా అంతరించిపోయాయి. ఌ కి ~l ని, ౡ కి ~L ని వాడండి.
ivi ~l~L lu→ ఇవి ఌౡ లు
ౘ మరియు ౙ లను టైపు చెయ్యడం ఎలా?
~ca, ~ja → ౘ, ౙ
నా సమస్యకి ఇక్కడ పరిష్కారం సూచించబడలేదు. నేనేంచేయాలి?
మీరు తెలుగుబ్లాగు గూగుల్ సమూహానికి మీ సమస్యని పంపించవచ్చు. నేను లేదా ఆ సమూహంలోని సభ్యులేవరైనా మీకు పరిష్కారాన్ని సూచించగలము.

